Breaking News

విజయ్ సేతుపతి- కత్రినా కైఫ్ మూవీ.. రిలీజ్‌ డేట్‌పై అప్‌డేట్‌!

Published on Thu, 10/05/2023 - 16:48

ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ భాషా భేదం లేకుండా ఎడాపెడా నటిస్తోన్న నటుడు  విజయ్‌సేతుపతి. అదే విధంగా కథానాయకుడు, ప్రతినాయకుడు అని కూడా ఆలోచించకుండా.. పాత్ర నచ్చితే ఓకే చెప్పేస్తున్నారు. అలా ఏక కాలంలో హీరోగా, విలన్‌గా నటిస్తున్న అరుదైన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనొక్కరే అని చెప్పక తప్పదు. తాజాగా హీరోగా నటించిన తమిళ చిత్రం మహారాజా. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం విజయ్‌సేతుపతికి 50వ చిత్రం కావడం గమనార్హం. 

కాగా విజయ్‌ సేతుపతి ఇప్పటికే ఫర్జ్‌ అనే హిందీ వెబ్‌ సిరీస్‌ ద్వారా ఫేమస్ అయ్యారు. తాజాగా జవాన్‌ చిత్రంలో షారూఖ్‌ఖాన్‌కు విలన్‌గా నటించి బాలీవుడ్‌లో మరింత గుర్తింపు  తెచ్చుకున్నారు. తాజాగా హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న మేరీ క్రిస్మస్‌ చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా బాలీవుడ్‌ క్రేజీ భామ కత్రినా కై ఫ్‌ నటించడం విశేషం.

ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కిస్తున్నారు. టిప్స్‌ ఫిలింస్‌, మ్యాచ్‌ బాక్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మేరీ క్రిస్మస్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. అయితే తాజాగా ఒక వారం ముందే అంటే డిసెంబర్‌ 8న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని హిందీ, తమిళం భాషల్లో వేర్వేరుగా రూపొందించినట్లు వారు తెలిపారు. దీంతో మేరీ క్రిస్మస్‌ చిత్రంపై కోలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)