Breaking News

పూరీ-సేతుపతి సినిమా టైటిల్‌ ఇదే.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌!

Published on Fri, 01/16/2026 - 11:37

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టైటిల్ టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ రోజు  ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. 

విజయ్‌ సేతుపతి(Vijay Sethupath) బర్త్‌డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని ఖరారు చేశారు.  33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. 

ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ.. ‘మురికివాడల నుంచి ఎవరూ తట్టుకోలేని తుపాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది’ అంటూ  విజయ్‌ పాత్ర తీరును వివరించారు.  ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా.. టబు, విజయ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం .. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)