Breaking News

విజయ్‌ సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..

Published on Thu, 01/04/2024 - 08:45

సంగీతజ్ఞాని ఇళయరాజా, దళపతి విజయ్‌ 23 ఏళ్ల తరువాత కలిశారు.. చాలా ఆసక్తిగా ఉంది కదూ. ఆ కథేంటో చూద్దాం. విజయ్‌ తాజాగా నటిస్తున్న తన 68 చిత్రానికి ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ అనే పేరును ఇటీవలే ఖరారు చేశారు. హాలీవుడ్‌ చిత్రాల తరహాలో ఆంగ్లంలో ఉన్న ఈ టైటిల్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే విధంగా ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యంగా ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేయడంతో పాటు భారీ తారాగణం ఉండబోతుంది. మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, మైక్‌ మోహన్‌, ప్రశాంత్‌, ప్రభుదేవా, వైభవ్‌, ప్రేమ్‌జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. తాజా షెడ్యూల్‌ కోసం యూనిట్‌ వర్గాలు శ్రీలంక బయలుదేరనున్నాయి. కాగా ఇళయరాజా సోదరుడు, వెంకట్‌ప్రభు తండ్రి, సంగీత దర్శకుడు, గీత రచయిత, దర్శకనటుడు గంగై అమరన్‌ ఈ చిత్రం కోసం ఒక పాట రాయడం విశేషం.

మరో విశేషం ఏమిటంటే ఈ పాటను నటుడు విజయ్‌, సంగీత దర్శకుడు ఇళయరాజా కలిసి పాడారన్నది తాజా సమాచారం. వీరిద్దరూ కలిసి 1995లో రాజావిన్‌ పార్వైయిల్‌, 1997లో కాదలుక్కు మరియాదై, 2000 సంవత్సరంలో కన్నుక్కుల్‌ నిలవు, 2001లో ఫ్రెండ్స్‌ చిత్రాల్లో కలిసి పని చేశారు. తాజాగా ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ చిత్రంలో కలిసి పాడడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

చదవండి: ఓటీటీలో ఆ సూపర్‌ హిట్‌ ప్రీక్వెల్.. మీరు చూశారా?

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)