Breaking News

విజయ్‌ సినిమాకు 6 వేల థియేటర్లు.. విడుదలకు ముందే లాభాలు

Published on Mon, 08/19/2024 - 15:45

విజయ్‌ రాజకీయాలకు ది గెటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం (గోట్‌) చిత్రానికి ఎలాంటి సంబంధం ఉండదని ఆ చిత్ర దర్శకుడు వెంకట్‌ ప్రభు పేర్కొన్నారు. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గోట్‌. నటుడు ప్రశాంత్‌, ప్రభుదేవా, మోహన్‌, జయరాం, అజ్మల్‌, అమీర్‌, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కల్పాత్తి ఎస్‌ అఘోరం, కల్పాత్తి ఎస్‌ గణేష్‌, కల్పాత్తి ఎస్‌. సురేష్‌ నిర్మించిన ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌ కథాచిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, సిద్ధార్థ నూని ఛాయాగ్రహణం అందించారు. 

నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6000కు పైగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత అర్చన మాట్లాడుతూ ఇది ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన 25వ చిత్రం అని తెలిపారు. అదేవిధంగా విజయ్‌ హీరోగా ఇంతకు ముందు బిగిల్‌ చిత్రాన్ని చేసామని, తాజాగా గోట్‌ ఆయనతో చేసిన రెండవ చిత్రమని చెప్పారు. లేకపోతే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందించిన తొలిచిత్రం. 

ఇది సాంకేతిక పరంగా చాలా బలమైన చిత్రమని పేర్కొన్నారు. గోట్‌ చిత్రం ఇప్పటికే టేబుల్‌ ప్రాఫిట్‌ నిచ్చిందని చెప్పారు. దర్శకుడు వెంకట ప్రభు మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ను ఇస్తాన్బుల్‌ లో నిర్వహించాలని వెళ్లామని అయితే అక్కడ షూటింగ్‌ సాధ్యం కాకపోవడంతో రష్యాలో కొంత భాగం చిత్రీకరించినట్లు చెప్పారు. అదేవిధంగా గోట్‌ చిత్ర షూటింగ్‌ అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ లోనే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. 

చిత్రంలోని వీఎఫ్‌ ఎక్స్‌ సన్నివేశాల కోసం ప్రపంచంలోనే పేరుగాంచిన లోలా సంస్థతో ఒప్పందం చేసుకుని రూపొందించినట్లు చెప్పారు. ఇది అన్ని వర్గాలను అందించే కమర్షియల్‌ అంశాలతో కూడిన పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు. నటుడు విజయ్‌ రాజకీయాలకు గోట్‌ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)