Breaking News

విజయ్-రష్మిక గ్రాండ్ రిసెప్షన్‌... కొడగు స్టైల్లో మెరిసిన జంట..!

Published on Tue, 04/07/2026 - 17:07

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకలోఅత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించారు.

ఇటీవలే రష్మిక తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత తన తొలి బర్త్‌ డేను ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకుంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని ఇగ్గుతప్ప ఆలయాన్ని కూడా సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే తాజాగా ఈ జంట మరోసారి రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు. రష్మిక సొంత గ్రామం కూర్గ్‌లో కొడగు సంప్రదాయంలో రిసెప్షన్‌  జరుపుకున్నారు. ఈ ఫంక్షన్‌లో రష్మిక కొడగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఈ రిసెప్షన్‌లో కూర్గి స్టైల్లో చీరను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ- రష్మిక జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కొడగు రావడం ఇది మూడోసారని తెలిపారు. మొదటిసారి రష్మికను కలవక ముందే ఇక్కడకు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. గతంలో ఒకసారి వచ్చినప్పుడు తన ఫ్రెండ్‌ ఇంట్లో ఉన్నానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. అయితే తన ఫ్రెండ్‌  ఈ రిసెప్షన్‌కు హాజరు కాలేదని తెలిపారు. నా స్కూల్ టైమ్‌లో స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చానని పంచుకున్నారు.

చాలా అందంగా ఉంటారు..

తనకు కొడగు అందాలు అంటే చాలా ఇష్టమని.. ఇక్కడి మహిళలు కూడా అంతే అందంగా ఉంటారని కొనియాడారు. కూర్గ్ మహిళలు చాలా అందంగా ఉంటారని.. నేను కూర్గ్ అమ్మాయినే వివాహం చేసుకున్నానని విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు. మిమ్మల్నందరినీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కొడగు రిసెప్షన్‌కు ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక- విజయ్ జంటహా 'రణబాలి' సినిమాలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
 

Videos

బూతు కిట్టు.. బ్రోకర్ కృష్ణ.. నీ తోలు వలిచి చెప్పులు కుట్టించకపోతే..

ABN రాధాకృష్ణ రాతలపై YS జగన్ ఆగ్రహం

డ్రంక్ అండ్ డ్రైవ్ బీభత్సం.. ఇద్దరు యువకులు మృతి

కాల్పుల విరమణ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

నీతిలేని కుక్క.. ఇంకోసారి అలాంటి రాతలు రాస్తే చెప్పుతో కొడతాం..

బూతు కిట్టూ నీతిలేని రాతలు.. చంద్రబాబు చెబితే దేనికైనా

అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?

బ్రోకర్ రాధాకృష్ణ నీకు కూతుర్లు లేరా.. RK రోజా వార్నింగ్

CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...

చెప్పుతీసి కొడతా... ABN రాధా కృష్ణపై రెచ్చిపోయిన తిరుపతి YSRCP మహిళా నేత

Photos

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)