Breaking News

పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్‌ వ్యాఖ్యలు వైరల్‌

Published on Wed, 02/25/2026 - 09:07

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసిన విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ నెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి ప్రేమాయణంపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ.. ఇద్దరూ స్పందించలేదు. తాము రిలేషన్‌లో ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ పరోక్షంగా హింట్‌ ఇస్తూనే వచ్చారు. చివరకు ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సడెన్‌గా పెళ్లి డేట్‌ని చెప్పి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. రేపు ఉదయం ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌లో వీరిద్దరు ఏడు అడుగులు వేయబోతున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.

ఇదిలా ఉంటే..పెళ్లివేళ రష్మికకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక గతంలో 'గీత గోవిందం' సినిమాలోని తన తొలి  ముద్దు సీన్‌ గురించి  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘తొలిసారి ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సీన్‌లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది చాలా వ్యక్తిగతమైన విషయం. సెట్‌లో 200 మంది చూస్తుండగా ఎలా చేయాలో అర్థం కాలేదు. అయితే, నా కో-యాక్టర్ విజయ్‌ది కూడా అదే పరిస్థితి. నాలాగే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు.  చివరకు అది ఒక టెక్నికల్ విషయంలా పూర్తి చేశాం. పాత్రకు అవసరమైతే అలాంటి సీన్‌ చేయాల్సిందే’ అని చెప్పుకొచ్చింది. కాబోయే భర్తతోనే తొలి ముద్దు సీన్‌ చేయడం గమనార్హం. కాగా, రష్మిక, విజయ్‌ గీత గోవిందంతో పాటు డియర్‌ కామ్రేడ్‌ అనే సినిమాలోనూ కలిసి నటించారు. 

Videos

Good News: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. అధిక పెన్షన్ పునరుద్ధరణ

Eluru : టీడీపీ నేతలకు షాక్! నేవీ డిపోకు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన

డయేరియా వ్యాప్తికి కారణం అదే దయచేసి చర్యలు తీసుకోండి

హోమంలో పాల్గొన్న జగన్

Youtuber కోమలి ఘటనలో బయటపడ్డ CCTV వీడియో

అమెరికాలోని ఫ్లోరిడాలో కార్చిచ్చు

రామ్, భాగ్యశ్రీకి... బ్రేకప్ చెప్పారా..?

ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు

విజయ్ & రష్మిక వెడ్డింగ్ విశేషాలు..

ఫెరారీ కారు ప్రమాద ఘటనలో సీసీ ఫుటేజ్ విడుదల

Photos

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)