మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్
Breaking News
అదీ విజయ్ క్రేజ్! ఆలిండియాలో సెకండ్ ప్లేస్
Published on Fri, 06/04/2021 - 20:44
'అర్జున్‌రెడ్డి'లో రఫ్ లుక్‌తో భయపెట్టినా, 'గీతా గోవిందం'లో మేడం మేడం అంటూ ఇన్నోసెంట్‌గా కనిపించినా అది ఒక్క విజయ్ దేవరకొండకే చెల్లుతుంది. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి ఎంతో సహజంగా నటించే ఈ రౌడీ హీరోకు బాలీవుడ్ స్టార్స్‌ను మించిన క్రేజ్ ఉంది. తాజాగా హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ పట్టం అందుకున్న ఇతడు మరో అరుదైన ఘనత సాధించాడు. ఆలిండియా లెవల్లో 'టాప్ 50 డిజైరబుల్ మెన్ ఆఫ్ 2020' జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. గతేడాది మూడో స్థానంలో ఉన్న విజయ్ బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ను వెనక్కు తోసి మరీ రెండో ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. ఇక రణ్‌వీర్ సింగ్ ఏకంగా ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.
2019లో 11వ స్థానంలో ఉన్న ఆదిత్య రాయ్ కపూర్ ఈసారి 3వ స్థానంలోకి దూసుకురావడం విశేషం. విక్కీ కౌశల్ గతేడాది సంపాదించుకున్న నాల్గవ స్థానంలోనే స్థిరంగా ఉన్నాడు. దుల్కర్ సల్మాన్ 5, విరాట్ కోహ్లి 6వ స్థానంలో నిలిచారు. గుర్‌ఫతేహ్ సింగ్ పిర్జాదా(9వ ర్యాంకు), ఇశ్వాక్ సింగ్(18), పవేల్ గులాటి(19), అలీ గోని(22), అక్షయ్ ఒబెరాయ్(31), వత్సల్ సేత్(36), విశ్నాల్ నికమ్(37), రోహిత్ సరఫ్(39), శుభ్‌మన్ గిల్(41), నిషాంత్ మల్కాని(44), యశ్‌దాస్ గుప్తా(46), నీల్ భట్(48), అవినాష్ తివారి(49) మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో కొత్తగా చేరారు.
Rowdy @TheDeverakonda at Top - 2 in India's Most desirable men 2020 #TimesMostDesirableMen2020 #MostDesirableManVijayDeverakonda pic.twitter.com/sxHSWYSFMw
— BARaju's Team (@baraju_SuperHit) June 4, 2021
చదవండి: Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్
Tags : 1