Breaking News

గండికోటలో...

Published on Fri, 06/05/2026 - 03:33

విజయ్‌ దేవరకొండ–రష్మికా మందన్నాల పెళ్లయి ముచ్చటగా మూడు నెలలైంది. అయితే ఈ ఇద్దరూ పెళ్లయిన తర్వాత జస్ట్‌ చిన్న బ్రేక్‌ మాత్రమే తీసుకుని, షూటింగ్స్‌తో బిజీ అయ్యారు. ఇక ఈ ఇద్దరూ జంటగా సిల్వర్‌ స్క్రీన్‌పై ‘గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో కనిపించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో రానున్న మూడో సినిమా ‘రణబాలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తోనే విజయ్‌–రష్మిక బిజీగా ఉన్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ వైఎస్‌ఆర్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోటలో జరుగుతోంది. కోట ముఖద్వారం దగ్గర, ధాన్యాగారంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత ఆదివారం గండికోటలో ఆరంభమైన ఈ చిత్రం షెడ్యూల్‌ నేటితో ముగుస్తుందని సమాచారం. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది.

ఈ చిత్రం కోసం విజయ్‌ దేవరకొండ స్టాలియన్‌ అనే బ్రీడ్‌కు చెందిన గుర్రాలను స్వారీ చేయడం నేర్చుకున్నారు. ‘‘ఇది చాలా కఠినమైన ట్రైనింగ్‌. స్టాలియన్‌ బ్రీడ్‌ గుర్రాలను స్వారీ చేయడం అంత ఈజీ కాదు’’ అని ఆ మధ్య విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా యూనిట్‌ పేర్కొంది. చిత్రబృందం పేర్కొన్నట్లే... విజయ్‌ చాలా ప్రయత్నాలు చేసి, సక్సెస్‌ఫుల్‌గా హార్స్‌ రైడింగ్‌ చేయడం ఆ  గ్లింప్స్‌లో కనిపించింది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌ – అతుల్, కెమెరా: నీరవ్‌ షా.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)