Breaking News

విజయ్‌ దేవరకొండ బంపరాఫర్‌.. 100 మంది అభిమానులకు ఫ్రీగా మనాలి ట్రిప్‌

Published on Sun, 01/08/2023 - 16:50

సినిమాల కంటే వాళ్ల ప్రవర్తనతో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న అతి తక్కువ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. హిట్‌..ప్లాఫ్‌తో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్‌ పాలోయింగ్‌ పెరుగుతూనే ఉంది. విజయ్‌ కూడా తరచూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్‌కు అభిమానులకు బహుమతులు అందిస్తున్నాడు ఈ టాలీవుడ్‌ సెన్సెషన్‌. దేవరశాంట పేరును ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో సర్‌ప్రైజ్‌ ఇస్తుంటాడు.  ఈ సారి మాత్రం 100 మంది ఫ్యాన్స్‌ని విహారయాత్రకు పంపించనున్నట్లు ప్రకటించారు. ఐదు రోజుల పాటు సాగే ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరించనున్నాడు.

క్రిస్మస్‌ సందర్భంగా విజయ్‌ తన సోషల్‌ మీడియాలో  ‘మీలోని 100 మంది హాలిడే ట్రిప్‌కి పంపించాలనుకుంటున్నాను. ఏ ప్రదేశాలు అయితే బాగుంటుందో చెప్పడంటూ భారత్‌లోని చారిత్రక ప్రదేశాలు.. పర్వతాలు.. బీచ్‌లు,ఎడారిని సూచించాడు. వాటిలో ఎక్కువ మంది పర్వతాలను ఎంచుకున్నారు. తాజాగా ఈ హాలిడే ట్రిప్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని ఓ వీడియో రూపంలో ఇచ్చాడు విజయ్‌.

‘నేను మీలో 100మందిని ఐదు రోజుల పాటు మనాలి టూర్‌కి పంపుతున్నాను.  అక్కడ ఫుడ్, ట్రావెల్‌తో పాటు అన్నింటిని నేనే చూసుకుంటాను.   మంచు దుప్పటేసిన పర్వతాలకు, ఆలయాలకు, మఠాల ను చూసి  ఎంజాయ్‌ చేయండి. మీ యాత్రకు సంబంధించిన ప్రణాళికను మేం సిద్ధం చేస్తాం. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఈ యాత్రకు అర్హులు. దీనికి మీరు చేయాల్సిన పనేంటంటే.. దేవరశాంట ఫారమ్‌ నింపి..నన్ను ఫాలో అవ్వండి. మీలో 100 మందిని ఎంపిక చేసి విహారయాత్రకు పంపిస్తాం. నేను మీ ప్రయాణంలో భాగం కావాలనుకుంటున్నాను. ట్రిప్‌ని ఎంజాయ్‌ చేయండి’అని విజయ్‌ చెప్పుకొచ్చాడు. విజయ్‌ ఇచ్చిన ఆఫర్‌ చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఆ వంద మందిలో తాము కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్‌ చేస్తున్నారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు