Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్‌, భాగ్యశ్రీ (వీడియో)

Published on Sun, 07/27/2025 - 10:33

విజయ్‌ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్‌’ సినిమా భారీ అంచనాలతో జూలై 31న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం తిరుపతిలో ట్రైలర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నాగవంశీ నిర్మించారు. అయితే, సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్‌ అందరూ తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ట్రైలర్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ రాయలసీమ యాసలో ప్రసంగించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలాకాలంగా ఆయన భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కింగ్డమ్‌ విజయం తన కెరీర్‌కు ఎంత ముఖ్యమో చెబుతూ తన మనసులో మాట ఇలా చెప్పాడు. ' మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాను. ఈసారి నా సినిమాని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ, వెంకన్నస్వామి దయ, ప్రేక్షకుల ఆశీసులు. ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే' అంటూ ఆయన అన్నారు. సినిమా వేడుక అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీసులు తీసుకున్నాడు. దీంతో విజయ్‌, భాగ్యశ్రీ, నాగవంశీ కలిసి ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)