Breaking News

కింగ్‌డమ్‌ ఫీవర్‌.. విజయ్ దేవరకొండ భారీ కటౌట్.. ఎన్ని అడుగులో తెలుసా?

Published on Wed, 07/30/2025 - 15:59

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా కింగ్‌డమ్‌ ఫీవర్ నడుస్తోంది. మాస్ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ సారి గట్టిగా కొడుతున్నాం అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.

ఈ నేపథ్యంలోనే విజయ్ అభిమానులు కింగ్‌డమ్‌ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌ వద్ద విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 75 అడుగుల ఎత్తు ఉన్న కటౌట్‌ను ఫ్యాన్స్‌ రెడీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

కాగా.. ఇటీవలే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా తిరుపతిలో 40 అడుగుల విజయ్ దేవరకొండ కటౌట్‌ను ఆవిష్కరించారు,. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై బజ్‌ను మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో నటులు సత్య దేవ్, వెంకటేష్, అయ్యప్ప శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. 'కింగ్‌డమ్' జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది.

 

 

 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)