Breaking News

కింగ్‌డమ్‌లో ఎవరా స్టార్‌ హీరో?.. విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?

Published on Wed, 07/30/2025 - 18:44

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్‌ విజయ్ దేవరకొండ. ఈ సినిమా రిలీజ్‌కు అంతా రెడీ అయిపోయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ అంచనాలు భారీగా పెంచేసింది. ఈ నెల 31న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ, నాగవంశీ సమాధానాలిచ్చారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కింగ్‌డమ్‌ ట్రైలర్‌ చివర్లో ఓ కెమియో రోల్‌ను చూపించారు. ఆ రోల్‌లో ఉన్నది స్టార్‌ హీరోనా? అని అడిగారు. ఇది మీరు థియేటర్లోనే చూడాల్సిందే అని విజయ్ దేవరకొండ అన్నారు. అలాగే మీరు ఊహించినట్లే పెద్ద హీరోనే ఉంటాడని చెప్పారు. ‍దీంతో అభిమానులు ఇంతకీ ఎవరా హీరో అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.

కాగా.. కింగ్‌డమ్‌ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ ట్రైలర్‌తో పటాపంచలయ్యాయి. ట్రైలర్‌ చూశాక కింగ్‌డమ్‌ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ట్రైలర్‌ విజయ్ దేవరకొండ, సత్యదేవ్‌ యాక్షన్‌ సీన్స్‌ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లెట్ల వర్షం కురిపించిన ఈ ట్రైలర్‌లో.. చివర్లో కాంతార స్టైల్లో కనిపించిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ స్టార్ కెమియో ఎవరు అంటూ నెట్టింట చర్చ మొదలైంది.

అయితే మొహానికి మాస్క్ ధరించి కాంతార స్టైల్లో కనిపించిన ఆ స్టార్‌ నటుడు ఎవరో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్‌ రక్షిత్ శెట్టి అని.. మరికొందరేమో హీరో నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్‌లో ఉన్న స్టార్ ఎవరో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)