Breaking News

‘లైగర్‌’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్‌! ఎంతంటే..

Published on Fri, 09/02/2022 - 18:16

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్‌’. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో హైప్‌ క్రియేట్‌ చేసిన లైగర్‌ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది. తొలి షో నుంచే నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో లైగర్‌ బాక్సాఫీస్‌ లెక్కలన్ని తలకిందులయ్యాయి. విడుదలకు ముందు ఈ మూవీ రూ. 200 కోట్లకుపైగా వసూలు చేస్తుందని ఆశపడ్డ విజయ్‌కి బాక్సాఫీసు ఫలితాలు షాకిచ్చాయి.

చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ!

దీంతో రౌడీ హీరో ఆశలన్ని అడియాసలయ్యాయి. అన్ని భాషల్లోనూ ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో లైగర్‌ మూవీ నిర్మాతలకు పెద్ద ఎత్తున్న నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌, నటి చార్మీ కౌర్‌లు నిర్మాతలు కాగా.. పూరీ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో లైగర్‌ పరాజయంతో పూరీ తన పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన తన వాటాలో 70 శాతం వెనక్కి ఇచ్చాడని సమాచారం. ఇక హీరోగా చేసిన విజయ్‌ కూడా తన పారితోషికంలో కొంతభాగాన్ని వదులుకున్నాడని తెలుస్తోంది.

చదవండి: శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌

ఈ సినిమాకి విజయ్‌ రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. దీనితో పాటు నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌లో విజయ్‌కి కూడా వాటా ఉందట. ఇప్పుడు ఆ  వాటాను వద్దని పూరీ, చార్మీలకు చెప్పడమే కాకుండా.. తన పారితోషికంలో రూ. 6 కోట్లను విజయ్‌ వెనక్కి ఇచ్చేసినట్లు ఫిలిం దూనియాలో టాక్‌ వినిపిస్తోంది. ఇది తెలిసి విజయ్‌ నిర్ణయంపై అతడి ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలను ఆదుకుని రియల్‌ హీరో అనిపించుకున్నాడంటూ విజయ్‌ అభిమానులు కాలర్‌ ఎగిరేస్తున్నారు. కాగా విజయ్‌ తన తదుపరి చిత్రం జన గణ మన కోసం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాడు. ఈ మూవీకి కూడా పూరీ దర్శకత్వం వహిస్తుండగా.. చార్మీతో కలిసి నిర్మించనున్నాడు. 

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)