Breaking News

ప్రెస్‌మీట్‌లో విజయ్‌ తీరుపై వివాదం.. స్పందించిన రౌడీ హీరో

Published on Fri, 08/19/2022 - 16:58

లైగర్‌ సినిమా కోసం దేశంలోని ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఉత్తరాది, దక్షణాదిలో వరుస ప్రెస్‌మీట్స్‌ నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో విజయ్‌ ప్రవర్తించిన తీరు బాగోలేదని విమర్శలు వచ్చాయి. దీనిపై ఓ జర్నలిస్ట్‌ స్పందిస్తూ.. 'మీడియా ముందు విజయ్‌ రెండు కాళ్లు టేబుల్‌ మీద పెట్టి యాటిట్యూడ్‌ చూపించాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆరోజు జరిగిందేంటంటే.. ఓ జర్నలిస్టు.. టాక్సీవాలా సమయంలో నేను మీతో చాలా ఫ్రీగా మాట్లాడేవాడిని.

అప్పుడు బాలీవుడ్‌కు వెళ్తారా? అని అడిగితే నవ్వేసి ఊరుకున్నారు. కానీ ఇప్పుడు నిజంగానే బాలీవుడ్‌కు వెళ్లారు. ఇప్పుడు ఫ్రీగా మాట్లాడాలంటే ఒకరకంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. విజయ్‌ అతడిలో భయం పోగొట్టడానికి మీరు ఫ్రీగా మాట్లాడండి.. కాలు మీద కాలేసుకుని మాట్లాడండి, నేనూ కాలు మీద కాలేసుకుని మాట్లాడతా, మనం చిల్‌గా మాట్లాడుకుందాం అని సరదాగా అన్నాడు. అలా సరదాగా టేబుల్‌పై కాళ్లు పెట్టాడు. ఆ చర్యను అక్కడున్న అందరం ఎంజాయ్‌ చేశాం' అని చెప్పుకొచ్చాడు.

అయినప్పటికీ కొందరు మాత్రం రౌడీ హీరోను ఇప్పటికీ తప్పుపడుతుండటంతో విజయ్‌ ఈ వివాదంపై స్పందించాడు. 'ఎవరి రంగంలో వారు ఎదగాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఎంతోమందికి టార్గెట్‌ అవుతుంటారు. కానీ మనం వాటిపై పోరాటం చేస్తూనే ఉండాలి. నీకు నువ్వు నిజాయితీగా ఉంటూ ప్రతిఒక్కరి మంచి కోరుకున్నప్పుడు ప్రజల ప్రేమ, ఆ దేవుని ప్రేమ నిన్ను తప్పకుండా రక్షిస్తుంది' అని ట్వీట్‌ చేశాడు.

చదవండి: బిగ్‌బాస్‌ ఎంట్రీని కన్‌ఫర్మ్‌ చేసిన బుల్లితెర కమెడియన్‌
ఓటీటీలోకి వచ్చేసిన షంషేరా.. ఎక్కడంటే?

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)