Breaking News

అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ'

Published on Fri, 05/02/2025 - 16:10

గత కొన్నాళ్లుగా హిట్ పడక డీలా పడిపోయిన హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. కింగ్డమ్ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మే 30న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే  'హృదయం లోపల' అని చిత్రంలోని తొలి పాటని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్(Anirudh Ravichander)కి విజయ్ ప్రేమలేఖ రాయడం విశేషం.

(ఇదీ చదవండి: చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?) 

'మనం పాట రిలీజ్ చేశాం కదా. ఈ సందర్భంగా అనిరుధ్ కి నా చిన్న ప్రేమలేఖ. వీఐపీ, త్రీ సినిమాలు రిలీజైనప్పటి నుంచే నేను అనిరుధ్ కి వీరాభిమానిని. అసలు ఈ కుర్రాడెవరా? నేను యాక్టర్ ‍అయిన తర్వాత అతడు మ్యూజిక్ కి నేను స్క్రీన్ పై కనిపించాలని అనుకునేవాడిని. పదేళ్ల తర్వాత ఇప్పుడు నా 13వ సినిమా రిలీజ్ కి రెడీ. మరో 28 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇది విజయ్ దేవరకొండ-అనిరుధ్ తొలి పాట. ఇప్పుడు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా' అని విజయ్ దేవరకొండ ట్వీట్ పెట్టాడు.

'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ మూవీని యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. అనిరుధ్ సంగీతమందించాడు. ఇప్పుడు ఈ పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ నెలంతా చేస్తూనే ఉంటారు. మరి ఈసారైనా 'కింగ్డమ్' మూవీతో(Kingdom Movie) విజయ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)