Breaking News

ఓటీటీలో అదరగొడుతున్న ఫ్యామిలీ స్టార్‌.. వారికి కూడా అందుబాటులోకి!

Published on Fri, 05/24/2024 - 15:59

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఫ్యామిలీ స్టార్‌. పరశురామ్‌ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. గీత గోవిందం కాంబినేషన్ కావడంతో అభిమానులు భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 5న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది.

అయితే ఓటీటీలో విడుదలైన ఫ్యామిలీ స్టార్‌కు సినీ ప్రియుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్‌  26న స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికీ అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌-5లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో మేకర్స్‌ మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

మొదట కేవలం తెలుగు, తమిళం భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటీటీలో ఫ్యామిలీ స్టార్‌కు వస్తున్న ఆదరణను చూసి మరో రెండు భాషల్లోనూ స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. విజయ్‌ దేవరకొండకు సౌత్‌లో ఉన్న క్రేజ్‌తో కన్నడతో పాటు మలయాళంలోనూ ఫ్యామిలీ స్టార్‌ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ప్రస్తుతం నాలుగు భాషల్లో ఫ్యామిలీ స్టార్‌ అలరిస్తోంది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)