Breaking News

విజయ్‌ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతంటే..?

Published on Mon, 02/23/2026 - 13:42

టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి  తొలిసారి స్పందించారు. తమ బంధం గురించి అభిమానులు పెట్టిన 'విరోష్‌' పేరును గౌరవిస్తున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫ్యాన్స్‌ తమలో ఒక భాగం అంటూ..  వారి కోరిక మేరకు పెళ్లి కార్యక్రమానికి వెడ్డింగ్‌ ఆఫ్‌ విరోష్‌ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, వారిద్దరి వయసు గురించి కొందరు కామెంట్లు చేస్తుండగా... అభిమానులే కౌంటర్‌ ఇస్తున్నారు. వాస్తవంగా ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్‌ గ్యాప్‌ లేదనే విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ (36), రష్మిక(30)ల మధ్య సుమారు ఆరేళ్ల గ్యాప్‌ ఉంది. విజయ్‌​ 1989లో జన్మించగా.. రష్మిక 1996లో జన్మించారు. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే పెద్దగా ఏజ్‌ గ్యాప్‌ కనిపించదు. దీంతో వారిద్దరిది సరైన జోడీ అంటూ ఫ్యాన్స్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు సంబంధించి సుమారు రూ. 80 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తను ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటారని టాక్‌. రష్మికకు సంబంధించి సుమారు రూ. 70 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తను ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటుందని సమాచారం.

గీత గోవిందం మూవీతో పరిచయమైన ఈ జోడీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆపై ‘డియర్‌ కామ్రేడ్‌’ మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వారి వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్‌లో మార్చి 4న వివాహ రిసెప్షన్‌ కార్యక్రమం జరగనుంది.
 

Videos

మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..

Ram Charan: మళ్లీ బుచ్చిబాబుతోనే..!

యుద్ధం తధ్యం.. ఇరాన్‌లోని ఇండియన్స్ కు పిలుపు

నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్

ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్

4 రోజులుగా షాకిస్తున్న గోల్డ్ రేట్స్... రూ.7 వేల పైనే పెరిగిన బంగారం ధర..

విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్ లీజ్ ! అజిత్ పవార్ మృతిపై రామ్మోహన నాయుడు కామెంట్స్

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్..!

హెరిటేజ్ పై చర్చకు ఎందుకు భయపడుతున్నావ్.. చంద్రబాబు?

ఎండాకాలం వాన.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Photos

+5

'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విజయవాడలో నోరూరించే రంజాన్ రుచులు.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

జ్యోతిరాయ్ 'కిల్లర్' మూవీ టీజర్ రిలీజ్ (ఫొటోలు)

+5

చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)

+5

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా?

+5

వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)

+5

లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌-1 లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)