విరోష్ జంట గొప్ప నిర్ణయం.. ఏకంగా 400 కుటుంబాలకు..!

Published on Wed, 10/14/2026 - 13:17

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. రాయలసీమలో బ్రిటీశ్ కాలంలో జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని.. ఆనాటి దారుణ పరిస్థితులను ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ‍అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

ఈ సంగతి పక్కనపెడితే తాజాగా రష్మిక, విజయ్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట తమ గొప్ప మనసును చాటుకున్నారు.  ఏకంగా 400 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కుటుంబాలకు మూడు నెలల పాటు సాయం చేస్తామని ప్రకటించారు. అన్నపూర్ణ పేరుతో 400 ఫ్యామిలీస్‌కు పౌష్టికహారం అందజేయనున్నట్లు రష్మిక వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'మీరు పోషించే పాత్రలలో మిమ్మల్ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి.. మీలో చాలా మంది 'జయమ్మకి, నాకు మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా?' అని అడుగుతూ ఉంటారు. దానికి నా సమాధానం ఉంది. ఇది ఎల్లప్పుడూ నేనే, ఇది ఆమె కూడా.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ప్రతిఫలంగా నేను ఎప్పుడూ ఇలాంటివి చేస్తూనే ఉంటా.. కానీ ఎప్పుడూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాను. ఎందుకంటే, నాకు, నా బృందానికి, మాలో కొందరికి తెలిస్తే చాలు అనుకున్నా. కానీ ఇప్పుడు నేను దీని గురించి బయటపెడుతున్నా.. ఎందుకంటే ఇది మిమ్మల్ని, నా ప్రియమైన వారిని, ఇలాంటిది ఏదైనా చేయడానికి ప్రభావితం చేయగలిగితే.. నేను చాలా సంతోషిస్తాను. నేను ఈ రోజు 400 కుటుంబాలను దత్తత తీసుకున్నా. ఒక్కో కుటుంబానికి 3 నెలల పాటు సహాయం చేయాలనుకుంటున్నా. రాబోయే ఒక సంవత్సరం పాటు దీనిని కొనసాగిస్తా. వారు ఆ డబ్బును నిత్యావసరాల కోసం ఆదా చేసి, దానిని తమ భవిష్యత్తును మెరుగ్గా ప్రణాళిక చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది.

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)