Breaking News

ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ

Published on Tue, 07/08/2025 - 20:02

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. జూలై 25న రావాల్సిన కింగ్‌డమ్ మరో ఆలస్యంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెలాఖర్లో బిగ్‌ స్క్రీన్‌పై కింగ్‌డమ్ రిలీజ్ కానుంది. ఓ స్పెషల్ వీడియోతో కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్క్రిప్ట్‌ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటున్నట్లు వెల్లడించారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో మనకు ఎలాంటి సపోర్ట్‌ లేకపోతే ఈ స్క్రిప్ట్‌ బాగాలేదు.. ఈ సినిమా నేను చేయను.. అని ముక్కుసూటిగా చెప్పలేం. గతంలో నాకు ఇంత ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అదే ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్‌ ఉన్న నటుడికే అవకాశం వస్తే.. ఆ స్క్రిప్ట్‌ను చేయనని ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఆ తర్వాత అతని తండ్రి వచ్చి మరో మూడు, నాలుగు నెలలు ఆగండి. వీలైతే ఎక్కువమంది రైటర్లను తీసుకొస్తానని అంటాడు. నేనైతే ఇటీవల స్క్రిప్ట్‌ల విషయంలో కాస్త కఠినంగానే ఉంటున్నా. నా దగ్గరకు వచ్చిన  దర్శకులతో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు డబ్బుతో పాటు కెరీర్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చేసేదానితో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నా. స్క్రిప్ట్‌తో ఓకే అనిపించిన తర్వాతే ముందుకు వెళ్తున్నా' అని అన్నారు.

కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిటారు. ఈ యాక్షన్‌ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)