ఇలాంటి పనులు చేయకండి.. ఫ్యాన్స్‌కు విజయ్‌ సూచన

Published on Fri, 05/02/2025 - 07:03

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్‌ రెగ్యూలర్‌గా బయట తిరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే, తను ఎక్కడికి వెళ్లిన అభిమానులు మాత్రం భారీగా వచ్చేస్తున్నారు. తన వెంట పడ వద్దుని వేడుకుంటున్నా వారు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా తాను సినిమా షూటింగ్‌కు వెళ్తున్నానని సూచించినా తమ కోసం ఐదు నిమిషాలు అయినా సరే మాట్లాడి వెళ్లాలని రోడ్డుపైనే కూర్చున్నారు. అలా విజయ్‌కు మదురైలో ఫ్యాన్స్‌ బ్రహ్మరథం పట్టారు. పార్టీ ఆవిర్భావంతో తమ ముందుకు వచ్చిన విజయ్‌ను చూసేందుకు తమిళనాడులో ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబడుతున్నారు. తమ అభిమానాన్ని అత్యుత్సాహంతో చూపించే వారెందరో ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దు అని విజయ్‌ వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ పరిస్థితులలో చైన్నె నుంచి మదురై మీదుగా కొడైకెనాల్‌కు జననాగయం సినిమా షూటింగ్‌ నిమిత్తం  విజయ్‌ వెళ్లారు. ఈ సమాచారంతో మదురై విమానాశ్రయంలో అభిమానులు ఉదయం నుంచే పోటెత్తారు. మదురైలో అనుమతి లేకుండా రోడ్‌ షోలు నిర్వహిస్తే చర్యలు తప్పవని విజయ్‌ అభిమానులకు కమిషనర్‌ లోకనాథన్‌ హెచ్చరికలు చేశారు. అయినా, అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. విజయ్‌ను చూసి, ఆయనకు ఆహ్వానం పలికే వెళ్తామని భీష్మించుకుని విమానాశ్రయం పరిసరాలలో కూర్చున్నారు. ఈ సమాచారంతో విజయ్‌ తొలిసారి చైన్నె విమానాశ్రయంలో మీడియా ముందుకు వచ్చారు. మీ అభిమానానికి కోట్లాది దండాలు అని పేర్కొంటూ, తాను సినిమా షూటింగ్‌ నిమిత్తం వెళ్తున్నానని, తన పని తనను చేయనివ్వండని వేడుకున్నారు. 

తన కోసం మదురై విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చినట్టు సమాచారం వచ్చిందని, అందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించ వద్దని, తన కాన్వాయ్‌ను అనుసరించ వద్దని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయం నుంచి అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లాలని కోరారు. అయితే, అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. విజయ్‌ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే దూసుకెళ్లారు. విజయ్‌ను ఆహ్వానిస్తూ నినాదాలు హోరెత్తించారు. అభిమానులను కట్టడిచేయలేక పోలీసులకు తంటాలు పడ్డారు. విజయ్‌ వాహనం మీదకు దూసుకెళ్లేందుకు యత్నించిన వారిని బౌన్సర్లు అడ్డుకోక తప్పలేదు. విజయ్‌ వాహనాన్ని వెంబడిస్తూ పలువురు అభిమానులు దూసుకెళ్లడం గమనార్హం.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)