Breaking News

జిలేబి సినిమా రివ్యూ

Published on Fri, 08/18/2023 - 18:45

స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్. చాలా గ్యాప్ తరువాత ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఆయన కొడుకు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేశాడు. జిలేబి అంటూ నేడు తండ్రీకొడుకులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..

కథ
జిలేబి కథ ఓ నలుగు కుర్రాళ్ల మధ్య జరుగుతుంది. కాలేజ్ చదువుకునే కుర్రాళ్లు హాస్టల్‌లో ఉంటారు. ఓ అమ్మాయి వల్ల వారి జీవితం ఎలా మారిందనేదే కథ. కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జిలేబి (శివానీ రాజశేఖర్)తో ఎలా పరిచయం ఏర్పడింది? ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? వీరిద్దరి మధ్యలోకి బుజ్జి (సాయి కుమార్ బబ్లూ) బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ) ఎలా వస్తారు? జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేస్తాడు? అన్నది కథ.

ఎవరెలా చేశారంటే?
విజయ్ భాస్కర్ కొడుకు శ్రీ కమల్ తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకోసం బాగానే కష్టపడినట్లు కనిపిస్తోంది. పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. శివానీ రాజశేఖర్ అందంగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారి నటనకు వంక పెట్టే అవకాశమే ఉండదు. మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా కనిపించిన వారంతా కూడా ఆకట్టుకున్నారు.

విశ్లేషణ
విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. బాయ్స్ హాస్టల్‌లో అమ్మాయిని పెట్టి.. ఆ పాయింట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విజయ్ భాస్కర్ తనదైన స్టైల్‌లో ఈ సినిమాను మలిచాడు. ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్, స్లోగా అనిపిస్తాయి. బాయ్స్ హాస్టల్‌లోకి హీరోయిన్ వచ్చిన దగ్గరి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మాటలు ఎంతో సెటైరికల్‌గా, కామెడీగా ఉంటాయి. ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్ మీద మరింతగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది.

ప్రథమార్దంలో పాత్రల పరిచయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విజయ్ భాస్కర్ అసలు కథను రెండో భాగంలో చూపించాడు. హాస్టర్ వార్డెన్ రూంలను చెక్ చేసే సీన్లు చూసి ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటారు. చేతబడి చేసే సీన్లు సైతం మెప్పిస్తాయి. ఆ సీన్లలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే, స్టోరీ.. బాగున్నాయి కానీ సాగదీత ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను ఎక్కువ సాగదీయడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్‌పై ఇంకాస్త ఫోకస్‌ చేయాల్సింది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

చదవండి: Bigg Boss 7 Nagarjuna Remuneration: బిగ్‌బాస్‌ కోసం నాగార్జున రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)