Breaking News

కొడుకును హీరోగా లాంచ్‌ చేస్తున్న డైరెక్టర్‌, గ్లింప్స్‌ రిలీజ్‌ చేసిన వెంకటేశ్‌

Published on Fri, 04/07/2023 - 10:05

‘‘విజయ భాస్కర్‌గారు నాకు ఇష్టమైన డైరెక్టర్‌. నా ఫేవరేట్‌ చిత్రాలైన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’లను ఆయన ఎంత చక్కగా తీశారో మనందరికీ తెలుసు. ఆయన తీసిన ‘జిలేబి’ కూడా తప్పకుండా మంచి వినోదాత్మక చిత్రం అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు హీరో వెంకటేశ్‌. దర్శకుడు విజయ భాస్కర్‌ తనయుడు శ్రీ కమల్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జిలేబి’. ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ భాస్కర్‌ దర్శకత్వంలో అంజు అశ్రాని సమర్పణలో ఎస్‌ఆర్‌కే పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మించారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ను విడుదల చేసిన అనంతరం వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ‘‘జిలేబి’తో నటుడిగా పరిచయమవుతున్న కమల్‌కి, నిర్మాతలు రామకృష్ణ, అంజులకు ఆల్‌ ది బెస్ట్‌. ఇది అందరూ చూసే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘వెంకటేష్‌గారి చేతులమీదుగా మా అబ్బాయి నటించిన ‘జిలేబి’ గ్లింప్స్‌ లాంచ్‌ కావడం సంతోషంగా ఉంది. ‘జిలేబి’ అందమైన ప్రయాణం. మణిశర్మగారు, రామకృష్ణ, అంజు, కెమెరామేన్‌ సతీష్‌... ఇలా అందరం కలిసి ఓ కుటుంబంలా పనిచేశాం’’ అన్నారు విజయ్‌ భాస్కర్‌. ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ‘జిలేబి’’ అన్నారు శివాని. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ఇది. బ్యాలెన్స్‌ ఉన్న రెండు పాటలను ఫారిన్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు రామకృష్ణ. ‘‘విజయభాస్కర్‌లాంటి దర్శకునితో మా తొలి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు అంజు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)