Breaking News

విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!

Published on Wed, 09/20/2023 - 08:28

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్‌ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్‌ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో విజయ్‌కు ధైర్యం చెప్పారు. తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన ప్రతి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించింది. పిల్లల పట్ల కన్నవారికి ఎంత ప్రేమ ఉంటుందో.. ఇలాంటి సమయంలో బాధను భరించడం చాలా కష్టంగానే ఉంటుంది. ఈ విషాద సమయంలో విజయ్‌ ఆంటోనీకి కోలీవుడ్ పరిశ్రమ అండగా నిలిచింది.

అయితే తమ పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో విజయ్ భార్య ఫాతిమా పోస్ట్ చూస్తేనే అర్థమవుతోంది. గతంలో ఆమె తన పెద్దకూతురి పట్ల చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ విషాద సమయంలో విజయ్, ఆయన భార్య ఫాతిమా ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. పిల్లలపై వారి ప్రేమను తెలిపేందుకు ఈ ట్వీట్‌ నిదర్శనం. ఫాతిమా తన కుమార్తె మీరా పాఠశాలలో సాధించిన విజయాల గురించి చేసిన పాత పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

మార్చిలో ఫాతిమా తన కూతురు మీరా స్కూల్ యూనిఫాంతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది. ట్వీట్‌లో రాస్తూ.. 'నా బలం వెనుక ఉన్న శక్తి, నా కన్నీళ్లకు ఓదార్పు, నా ఒత్తిడికి కారణం(నీ కొంటెతనం సూపర్)నా తంగకట్టి-చెల్లకుట్టి. మీరా విజయ్ ఆంటోనీ కంగ్రాట్స్ బేబీ’.' అంటూ పోస్ట్ చేసింది. కుమార్తె మరణం తర్వాత ఫాతిమా చేసిన పాత పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.  కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్‌ ఆంటోనీ, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జయం రవి, ఆర్జే బాలాజీ, శరత్‌కుమార్, పలువురు తారలు సంతాపం తెలిపారు.  కాగా.. విజయ్ భార్య ఫాతిమా ఫిల్మ్ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. విజయ్ సినిమాలకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు