Breaking News

ఆ బ్యానర్‌కు విజయ్‌ ఆంటోని ఫుల్‌ సపోర్ట్‌.. ఏకంగా మూడు సినిమాలు..

Published on Wed, 07/12/2023 - 09:44

పిచ్చైక్కారన్‌ –2(బిచ్చగాడు 2) చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొలై. బాలాజీ కుమార్‌ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్‌, లోటస్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇందులో నటి రిత్వికా సింగ్‌, మీనాక్షి చౌదరి నాయకిలుగా నటించారు. గిరీష్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా సోమవారం చైన్నెలోని సత్యం థియేటర్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి, కలైపులి ఎస్‌. ధాను, సత్య జ్యోతి త్యాగరాజన్‌, అమ్మ క్రియేషన్స్‌ శివ ,దర్శకుడు విజయ్‌, లింగుసామి, మిష్కిన్‌, నటుడు జాన్‌ విజయ్‌, నటి మీనాక్షి చౌదరి, ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్‌ ఫ్యాక్టరీ శక్తి వెల్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ వేదికపై నిర్మాత ధనుంజయన్‌ మాట్లాడుతూ.. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్‌ సంస్థను ప్రారంభించడానికి ముఖ్య కారణం నటుడు విజయ్‌ ఆంటోనీ అని పేర్కొన్నారు. ఈ సంస్థలో వరుసగా మూడు చిత్రాలు చేద్దామని ఆయనే తమను ప్రోత్సహించారని తెలిపారు. ఆ విధంగా కొలై చిత్రం, తర్వాత రత్తం, ఆ తర్వాత మలై పిడిక్కాద మనిదన్‌ చిత్రాలు తమ సంస్థ నుంచి వరుసగా విడుదల కానున్నాయని చెప్పారు. ఇలా విజయ్‌ ఆంటోనితో వరుసగా చిత్రాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు బాలాజీ కుమార్‌ దీన్ని ఉత్తమ చిత్రంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన బడ్జెట్‌ చిత్రాలు మంచి విజయాన్ని సాధించినట్లు ఈ చిత్రం కూడా సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చాలా ఎమోషనల్‌ విషయాలు చోటుచేసుకుంటాయని ధనుంజయన్‌ తెలిపారు.

చదవండి: ప్రాజెక్ట్‌ కె యూనిట్‌పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)