Breaking News

ఇంతటి దుఃఖంలో కూడా విడుదల ఆపొద్దని చెప్పిన విజయ్‌ ఆంటోనీ.. కారణమిదే

Published on Sat, 09/23/2023 - 11:29

సినీ నటుడు విజయ్‌ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం ఇప్పటికీ శోకసంద్రంలోనే ఉంది. మీరాతో పాటు తాను కూడా మరణించానని ఆయన తెలిపాడు. కంటికి రెప్పలా చూసుకున్న బిడ్డ చనిపోతే ఏ తండ్రి అయినా పడే బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన కుటుంబం మొత్తం ఇంత దుఃఖంలో ఉన్నా తన కొత్త సినిమా  'రత్తం' విడుదల ఆపకూడదని నిర్ణయించుకోవడం విశేషం.

(ఇదీ చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బాలకృష్ణ)

దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఆ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని ఆయన భావించాడట. ముందుగా అనుకున్న సమయానికే చిత్రం అక్టోబర్‌ 6న తమిళ్‌లో విడుదలవుతోందని మేకర్స్‌ ప్రకటించారు.తెలుగు వర్షన్‌ విడుదల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రెండు వారాల క్రితం నుంచే రత్తం సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టారు. బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను కూడా ముందస్తుగానే లాక్ చేసుకున్నారు. తీరా ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని విజయ్‌ ఆంటోనీ భావించారట.

చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీఎస్‌ ఆముధన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా కనిపించనున్నారు విజయ్‌. చెన్నైలో జరిగిన ఈ వరుస హత్యల కారణంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కొందరు మంత్రుల రాజీనామాకు కూడా దారితీసింది.

ఈ సన్నివేశాల్ని ఎంతో ఆకట్టుకునే విధంగా దర్శకుడు చూపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో నందితా శ్వేత జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనుంది. మీడియా, రాజకీయ, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీలో ప్రధానంగా చూపించారని తెలుస్తోంది.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)