Breaking News

సమ్మర్‌ స్పెషల్‌గా విజయ్‌ ఆంటోని ‘బిచ్చగాడు 2’

Published on Thu, 12/22/2022 - 09:58

సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్‌ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్‌(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై మంచి పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్‌–2 తెరకెక్కుతోంది.

చదవండి: ఆస్కార్‌ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

విశేషమేంటంటే ఈ చిత్రం ద్వారా విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్‌ హక్కులను స్టార్‌ నెట్‌ వర్క్‌ సంస్థ సొంతం చేసుకుంది. 2023లో సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)