Breaking News

విజయ్ ఆంటోని మిస్టరీ థ్రిల్లర్‌.. తెలుగు ట్రైలర్‌ చూశారా?

Published on Wed, 05/28/2025 - 18:00

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమాకు కోలీవుడ్‌లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన లియో జాన్‌ పాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే డైరెక్టర్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. మర్టర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.

ఇటీవల మార్గన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హీరో విజయ్ ఆంటోనీ హాజరయ్యారు. అయితే మూవీ పాత్రకు సంబంధించిన గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ సందర్భంగా మీ గెటప్‌ గురించి ఏమైనా రివీల్ చేస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మీకు సినిమా మొత్తం ఇక్కడే చూపిస్తామని నవ్వుతూ మాట్లాడారు. ఒకవేళ ఇండియాలో నేనే గనక రిచ్ అయ్యుంటే.. నా సినిమాలన్నీ ఉచితంగా ప్రదర్శించేవాడినని విజయ్ అన్నారు. ఇది విన్న అభిమానులు విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మార్గన్‌ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్‌ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్‌లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)