Breaking News

విజయ్‌ ఆంటోని కెరీర్‌లో 25వ సినిమా.. టీజర్‌ చూశారా?

Published on Thu, 03/13/2025 - 17:03

హీరోగా, నిర్మాతగా, గేయ రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్నారు విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఆయన ప్రస్తుతం తన 25వ చిత్రం ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు నిర్మిస్తున్నారు.

తాజాగా భద్రకాళి సినిమా టీజర్‌ రిలీజ్ చేశారు. ‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్ధం, అహంకారం అంతం అవును’.. అంటూ ప్రారంభమైన ఈ టీజర్‌లో విజయ్ ఆంటోని అసలు ఏ పాత్రను పోషిస్తున్నాడనేది అర్థం కాకుండా ఉంది. ఒకసారి ఫ్యామిలీ మెన్‌లా, మరోసారి గ్యాంగ్‌స్టర్‌లా, ఇంకో సందర్భంలో ఉన్నతాధికారిలా కనిపిస్తున్నారు.

రూ.190 కోట్ల కుంభకోణం చుట్టూ కథ తిరిగేలా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ చివర్లో వచ్చే డైలాగ్‌ సస్పెన్స్‌కు తెరదీసింది. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ కనిపించనంత స్టైలిష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనియే సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. భద్రకాళి సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

 

చదవండి: అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్‌బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..!

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు