Breaking News

నయనతార భర్త విగ్నేశ్‌ శివన్‌కు షాక్‌ ఇచ్చిన స్టార్‌ హీరో

Published on Mon, 01/30/2023 - 09:22

తమిళ సినిమా:  చిత్ర పరిశ్రమను విచిత్ర పరిశ్రమ అంటారు. ఇక్కడ లక్కు కిక్కు కంటే కూడా మరొకటి ఉంటుంది. అదేంటో దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నేష్‌ శివన్‌ను చూస్తే తెలుస్తుంది. పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనా నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. తాజాగా నటుడు అజిత్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం వరించింది. అజిత్‌ చిత్రం తుణివు ఇటీవల విడుదలై సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది.

తదుపరి విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనిని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనుంది. అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. చిత్రం నుంచి దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ వైదొలిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అందుకు కారణం విగ్నేశ్‌ శివన్‌ చెప్పిన కథ నటుడు అజిత్‌కు, లైకా సంస్థకు సంతృప్తినివ్వక పోవడమేనని సమాచారం.

కథలో కొన్ని మార్పులు చేయాలని సంస్థ చెప్పినా అందుకు విగ్నేష్‌ శివన్‌ నిరాకరించినట్లు టాక్‌. దీంతో నటి నయనతార రంగంలోకి దిగి ఇరువురి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. అజిత్‌ కన్విన్స్‌ అయినా లైకా ప్రొడక్షన్స్‌ ససేమిరా అన్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్‌ 62వ చిత్రానికి మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు తాజా సమాచారం. ఈయన ఇంతకుముందు మిగామన్, తడం, కలగతలైవన్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా విజయ్‌ కోసం తయారు చేసిన కథను అజిత్‌తో చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్‌.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)