Breaking News

ఆ సినిమా తర్వాత సిగరెట్‌కు బానిసయ్యా.. : విద్యాబాలన్‌

Published on Fri, 04/26/2024 - 12:11

సినిమా వాళ్ల రూటే సెపరేటు.. వారికి పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నా, లేకున్నా సరే.. కథ డిమాండ్‌ చేస్తే కళ్లు మూసుకుని ఫాలో అయిపోతారు. ఇష్టం లేకపోయినా ముక్కు మూసుకుని మందు తాగేస్తారు. కష్టంగా ఉన్నా దమ్ము కొడతారు. సినిమా అయిపోయాక మాత్రం వాటిని అంత ఈజీగా వదిలేయలేరు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది హీరోయిన్‌ విద్యాబాలన్‌.

రోజూ సిగరెట్లు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సిగరెట్‌ ఎలా తాగుతారో తెలుసు కానీ నేనెన్నడూ ట్రై చేయలేదు. డర్టీ పిక్చర్‌లో నేను స్మోక్‌ చేయాలి. ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ పాత్ర పండదు. అందుకే సిగరెట్‌ తాగడం నేర్చుకున్నాను. ఆ సినిమా తర్వాత దానికి ఎంత అడిక్ట్‌ అయిపోయానంటే రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలిస్తే కానీ మనసు శాంతించేది కాదు. కానీ అప్పట్లో ఆడవాళ్లు ధూమపానం చేస్తే ఎంతో పెద్ద నేరంగా చూసేవారు. ఇప్పుడు ఆ ధోరణి కాస్త తగ్గిందనుకోండి.

ఆ స్మెల్‌ ఇష్టం
ధూమపానం ఆరోగ్యానికి హానికరమేమీ కాదని ఎవరైనా చెప్పుంటే ఇప్పటికీ ఆ అలవాటుకు బానిసగానే ఉండేదాన్ని. ప్రస్తుతమైతే సిగరెట్లు తాగడం లేదు. అయితే కాలేజీ చదివే రోజుల్లో బస్‌ స్టాప్‌లో పొగతాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగ ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు నచ్చేది' అని విద్యాబాలన్‌ చెప్పుకొచ్చింది. కాగా ఈమె నటించిన దో ఔర్‌ దో ప్యార్‌ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్‌ అవుతోంది. మిక్స్‌డ్‌ రివ్యూస్‌ అందుకున్న ఈ చిత్రం వారం రోజుల నుంచి కేవలం రూ.3.32 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

చదవండి: మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతోందా?

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)