Breaking News

ఓటీటీలో 'విడుదల 2' స్ట్రీమింగ్‌.. సంక్రాంతికి ప్లాన్‌

Published on Mon, 12/30/2024 - 13:51

విజయ్‌ సేతుపతి, సూరి లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.  వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్‌ 1’ చిత్రం 2023లో రిలీజ్‌ కాగా తమిళ్, తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్‌ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్‌ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు.

విడుదలై 2 బాక్సాఫీస్‌ వద్ద ఊహించనంతగా మెప్పించలేదు. దీంతో పెద్దగా కలెక్షన్స్‌ కూడా సాధించలేకపోయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ  భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే, ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌లో ఉన్నారట.  2025 జనవరి 17వ తేదీన ‘విడుదల 2’ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చే ప్లాన్‌లో జీ5 ఉన్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు వర్షన్స్‌ రెండూ ఒకే రోజు అందుబాటులోకి రానున్నట్లు టాక్‌. అయితే,  ఈ విషయంలో 'జీ5' ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటి వరకు రూ. 50 కోట్ల మార్క్‌ను అందుకుంది.

కథేంటంటే.. 
ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌(విజయ్‌ సేతుపతి) అరెస్ట్‌తో  'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్‌ విచారణతో పార్ట్‌ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్‌ అరెస్ట్‌ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్లాన్‌ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్‌(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు.

మార్గమధ్యలో పెరుమాళ్‌ తన ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ చెబుతాడు. స్కూల్‌ టీచర్‌గా ఉన్న పెరుమాళ్‌ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్‌) పరిచయం పెరుమాళ్‌ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్‌)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి?  ప్రజల కోసం పెరుమాళ్‌ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్‌ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్‌ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)