Breaking News

హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Published on Wed, 07/17/2024 - 14:19

దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల పార్ట్ 1" బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌గా నిలిచింది. దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన విడుదల 2 ఫస్ట్ లుక్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తెలుగు, తమిళంలో "విడుదల 2" ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేశారు.

విడుదల పార్ట్‌ 1కు మంచి స్పందన
ఈ సందర్భంగా నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ.. విడుదల పార్ట్ 1 సినిమాకు మూవీ లవర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మా టీమ్‌ అంతా ఎంతో సంతోషించాం. విడుదల పార్ట్ 1 అంచనాలను మించి విజయం సాధించింది. నటుడు సూరికి ఎంతో పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ మహారాజ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. 

అప్పుడే రిలీజ్‌
దర్శకుడు వెట్రిమారన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇళయరాజా సంగీతం విడుదల 2 మూవీకి మరో ఆకర్షణ కానుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ చేస్తాం అన్నారు. ఈ మూవీలో భవానీశ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

 

చదవండి: బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసిన బాలీవుడ్‌ బ్యూటీ

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)