Breaking News

'12th Fail' రూ.30 లక్షలు కూడా రావన్నారు, నా భార్య కూడా..

Published on Sun, 02/04/2024 - 17:04

కొన్ని సినిమాలు మ్యాజిక్‌ చేస్తాయి. ఎంతటి కఠిన హృదయాలనైనా కదిలించేస్తాయి. సినిమా చూసిన తర్వాత కూడా మనల్ని వెంటాడతాయి. అలాంటి సినిమానే 12th ఫెయిల్‌. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ మూవీ కలెక్షన్స్‌ ‍కూడా బాగానే రాబట్టింది. హాట్‌స్టార్‌లోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విధు వినోద్‌ చోప్రా మాట్లాడుతూ.. 'వంద రోజులు వెనక్కు వెళ్తే ఆ రోజు ఈ సినిమా తొలిసారి స్క్రీనింగ్‌ వేశాం.

12th ఫెయిల్‌ ఎవరూ చూడరన్నారు
అప్పుడు బాక్సాఫీస్‌ దగ్గర రూ.100 కోట్లు, రూ.500 కోట్లు, రూ.1000- 2000 కోట్ల గురించి మాట్లాడుకుంటున్న రోజులు.. నేను అందులో కొంతైనా రాబడతానా? అనుకున్నాను. అయినా ఈ సినిమా తీయడం వెనక నా ఉద్దేశ్యమేంటి? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. మనం నిజాయితీగా సినిమా తీస్తే కలెక్షన్లు వాటంతటవే వస్తాయని నమ్మాను. అయితే 12th ఫెయిల్‌ చూసేందుకు ఎవరూ థియేటర్స్‌కు రారని చాలామంది భయపెట్టారు. అందులో నా భార్య(అనుపమ చోప్రా) కూడా ఒకరు. విక్రాంత్‌, నువ్వు కలిసి చేసిన ఈ సినిమాను ఎవరూ చూడరు.

రూ.30 లక్షల కంటే ఎక్కువ రావన్నారు
నేనైతే ఇలాంటి సినిమాలకు కనెక్ట్‌ అవను. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ చేసుకో అని చెప్పింది. కొందరైతే ఈ మూవీ ఓపెనింగ్‌కు రూ.2 లక్షలు వస్తాయి. ఓవరాల్‌గా రూ.30 లక్షలు రాబడితే అదే గొప్ప అని రాసేశారు. చాలా భయపెట్టారు. కానీ నేను ఈ సినిమాను నమ్మాను. నా నమ్మకం వమ్ము కాలేదు. 12th‍ ఫెయిల్‌ అందరినీ ఆకట్టుకుంది' అని చెప్పుకొచ్చాడు. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో విక్రాంత్‌ మాస్సే మనోజ్‌గా నటించాడు. మనోజ్‌ భార్య, ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్‌ మెప్పించింది. దాదాపు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అరవై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

చదవండి:  ఎదురుచూపులకు బ్రేక్‌.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ మూవీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)