Breaking News

ఆ సాంగ్‌ విని అర్థరాత్రి రెండు గంటలకు డ్యాన్స్‌ చేశా: వెంకటేశ్‌

Published on Sat, 01/11/2025 - 17:51

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో విక్టరీ వెంకటేశ్‌(venkatesh) ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. బ్లాక్‌ బస్టర్‌ పొంగల్‌ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాను ఊపేస్తుంది. యూట్యూబ్‌లో మిలియన్లకొద్ది వ్యూస్‌ వస్తున్నాయి. అయితే ఈ పాట మొదట వెంకటేశ్‌తో పాడించాలని అనుకోలేదట మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ సిసిరోలియో. దర్శకుడు అనిల్‌ రావిపూడికి కూడా ఆ ఆలోచన లేదట. కానీ వెంకటేశ్‌ పాడతానని అనడంతో ట్రై చేశారట. అది కాస్త బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట గురించి వెంకటేశ్‌ కూడా మాట్లాడారు. తనకు బాగా నచ్చడంతోనే ఆ పాట పాడినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పాట వినగానే తెలియకుండా డ్యాన్స్‌ చేశాడట.

‘అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) నాకు ఈ పాటను షేర్‌ చేసి వినమని చెప్పారు. అర్థరాత్రి 2 గంటలకు ఆ సాంగ్‌ వింటూ తెలియకుండా డాన్స్‌ చేశాను. ఎదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్ లో ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే ఉంది. ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది’ అని వెంకటేశ్‌ అన్నారు. అలాగే రమణ గోగుల పాడిన పాటకు బాగా నచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాట పాడడం, దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు.

ముచ్చటగా మూడోది
అనిల్‌ రావిపూడి, వెంకేటశ్‌లది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్‌2, ఎఫ్‌3 చిత్రాలు ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కూడా దిల్‌ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రాలే. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam).  ఈచిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్లుగా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.

ప్రమోషన్స్‌లో సూపర్‌ హిట్‌
ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో మొదటి చిత్రం గేమ్‌ ఛేంజర్‌ అల్రెడీ రిలీజైంది. రేపు(జనవరి 12) బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ రిలీజ్‌ కానుంది. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’రిలీజ్‌ అవుతుంది. అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్లలో విషయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముందంజలో ఉంది. 

అన్నింటికంటే చివరిగా రిలీజ్‌ అవుతున్నప్పటికీ.. మిగతా రెండు సినిమాల కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించాయి. డిఫరెంట్‌ ప్రమోషన్స్‌తో సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లారు. ఒక పక్క అనిల్‌ రావిపూడి హీరోయిన్లు, మరోపక్క విక్టరీ వెంకటేశ్‌, అందరూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని చేశారు. కేవలం ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా టీవీ షోలు, కామెడీ షోలు అన్నింటిల్లోనూ పాల్గొన్నారు. వెంకటేశ్‌ అయితే గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ప్రమోషన్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌  వద్ద కూడా అదే స్థాయిలో రానిస్తుందో లేదో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.  

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)