Breaking News

సంక్రాంతికి మంచి మూవీతో వస్తున్నాం: వెంకటేశ్‌

Published on Tue, 01/14/2025 - 03:08

‘‘సంక్రాంతికి వస్తున్నాం’ బాగా వచ్చింది. మీరంతా మీ ఫ్యామిలీతో థియేటర్స్‌కు వచ్చి, మా సినిమాని ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు వెంకటేశ్‌. ఆయన హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు (మంగళవారం) విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బ్లాక్‌బస్టర్‌ మ్యూజికల్‌ నైట్‌’ ఈవెంట్‌లో వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహా సినిమాలను నా ఫ్యాన్స్‌ ఎక్కువగా ఇష్టపడతారు. అనిల్‌ ప్రతి సీన్‌ని అద్భుతంగా తీశాడు. మళ్లీ మేము సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారితో నేను చేసిన మూడో ఫిల్మ్‌ ఇది. ఆడియన్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమా నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది’’ అని తెలిపారు అనిల్‌ రావిపూడి.

‘‘వెంకటేశ్‌గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నా కల నిజమైనట్లుగా ఉంది’’ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ‘దిల్‌’ రాజు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర లిమాయే, సింగర్‌ రమణ గోగుల, లిరిక్‌ రైటర్స్‌ రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ ప్రకాశ్, ఎడిటర్‌ తమ్మిరాజు, డీవోపీ సమీర్‌ రెడ్డి పాల్గొని, మాట్లాడారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)