Breaking News

ఓటీటీలో క్రైమ్‌ థ్రిల్లర్‌ 'విక్టిమ్‌' స్ట్రీమింగ్‌

Published on Sun, 08/07/2022 - 09:50

విక్టిమ్‌ వెబ్‌ సిరీస్‌ శుక్రవారం నుంచి సోనీ లైవ్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌ అవుతూ ఆదరణ పొందుతోంది. ఒకే కాన్సెప్టును నలుగురు డైరెక్టర్లు వివిధ కోణాల్లో సిరీస్‌ను తెరకెక్కించారు. పా.రంజిత్‌ దమ్మమ్‌ అనే కథను, వెంకట్‌ ప్రభు కన్ఫెషన్స్‌ అనే కథను, ఎం.రాజేష్‌ విలేజ్‌ మిర్రర్‌ కథను, శింబుదేవన్‌ కోట్టై పాక్కు వత్తలుమ్‌ మొట్టైమాడి సిత్తరుమ్‌ అనే కథను రూపొందించారు. ఈ నాలుగు కథలు కాన్సెప్ట్‌ ఒకటే. భావోద్రేకాలతో కూడిన వినోదాన్ని జోడించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలతో తెరకెక్కించారు. అయితే నలుగురు దర్శకులు వారి వారి శైలిలో రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ఇది.

కరోనా కాలంలో ఇంటిలోనే ఉండిపోయిన ఒక సహాయ కథా రచయితకు పని పోయే పరిస్థితి. దీంతో అతనికి ఒక సిద్ధ వైద్యుడి గురించి తెలియడంతో ఆయన్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందన్న అంశాలను వినోదభరితంగా రూపొందించిన కథ కోట్టై పాక్కు వత్తలుమ్‌ మొట్టైమాడి సిత్తరుమ్‌. ఇందులో సహాయ రచయితగా తంబి రామయ్య, సిద్ధ వైద్యుడిగా నాజర్‌ నటించారు.

అదే విధంగా నటుడు నటరాజన్‌ ఇంటిలో అద్దెకు నివసిస్తున్న నటి ప్రియా భవాని శంకర్‌ జీవితంలో జరిగే సంఘటనలతో రూపొందిన కథ విలేజ్‌ మిర్రర్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన కన్ఫెషన్స్‌ కథలో నటి అమలాపాల్‌ ప్రధాన భూమిక పోషించారు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఆమె చక్కగా నటించారు. మరో ముఖ్య పాత్రలో ప్రసన్న నటించారు. ఇక పా.రంజిత్‌ తెరకెక్కించిన దమ్మమ్‌ కథ తండ్రీ కూతురు, సమాజం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నటుడు గురు సోమసుందరమ్‌ ప్రధాన పాత్రలో నటించారు.

చదవండి: నాకున్న ప్రేమను ఇలా తెలియజేశాను: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)