Breaking News

సామ్‌ బహదూర్‌ టీజర్‌ రిలీజ్‌.. చాలా కష్టపడ్డానంటున్న హీరో

Published on Sat, 10/14/2023 - 16:16

బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సామ్‌ బహదూర్‌. భారతీయ మొట్ట మొదటి ఫీల్డ్‌ మార్షల్‌ సామ్‌ మానెక్‌షా జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్‌ తెరకెక్కింది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ విడుదలైంది. 'యుద్ధంలో చనిపోవడమే సైనికుడి పని అని ఇందిరా గాంధీ అంటే.. ప్రత్యర్థి వైపున్న జవాన్లను అంతమొందించడమే సైనికుడి అసలైన కర్తవ్యం', 'నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, ఆర్మీయే నా ప్రాణం' అని విక్కీ కౌశల్‌ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధానికి సామ్‌ మానెక్‌షా ఏ విధంగా సారథ్యం వహించారు? సైనికులకు ఎలాంటి శిక్షణ అందించాడనేది ఈ చిత్రంలో చూపించారు. తాజాగా విక్కీ కౌశల్‌ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 'సామ్‌ మానెక్‌షా అని రాసి ఉన్న ఆర్మీ యునిఫామ్‌ ధరించడమే పెద్ద బాధ్యత. ఈ విషయంలో నేను ఏడీజీపీఐ(అడిషనల్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌)కి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. వారిని కలిసినప్పుడల్లా ఈ పాత్రను సమర్థవంతంగా పోషించాలని చెప్పేవారు.

కాబట్టి సినిమా చేస్తున్నంతసేపూ ఆ ఒత్తిడి నాపై ఉంది. నాకు సాధ్యమైనంతవరకు బాగా చేయడానికే ప్రయత్నించాను. చిత్రయూనిట్‌ అంతా కష్టపడ్డాం. నిజానికి సామ్‌ యుక్తవయసులో ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు అతడి మనవడిని అనేకసార్లు కలిశాం. చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాం. దీనిద్వారా ఆయన మాట్లాడే తీరు, నడకతీరు తెలుసుకుని దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించాను' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ డిసెంబర్‌ 1న రిలీజ్‌ కానుంది.

చదవండి: బిగ్‌బాస్‌ షాకింగ్‌ నిర్ణయం.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్‌ ఫోన్స్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)