Breaking News

భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన స్టార్ హీరో!

Published on Fri, 06/28/2024 - 19:36

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల కత్రినా కైఫ్‌ గర్భం దాల్చిందంటూ గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌లో కత్రినా వదులుగా ఉన్న అవుట్‌ఫిట్‌లో కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్ స్పందించారు. తన రాబోయే చిత్రం బాడ్ న్యూజ్ ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన క్లారిటీ ఇచ్చారు.

విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. 'ఏదైనా శుభవార్త ఉంటే మీతోనే మొదట చెబుతా. ప్రస్తుతం మీరు మా బ్యాడ్‌ న్యూజ్‌ సినిమాను ఎంజాయ్ చేయండి. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దానిపై మాట్లాడుకుందాం'  అని అన్నారు. కాగా.. ఈ జంట త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు టాక్ నడిచింది. ఒక నెల క్రితం లండన్‌లో భర్త విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్‌ వేకేషన్‌కు వెళ్లగా అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి. విక్కీ, కత్రినా రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

సినిమాల విషయానికొస్తే విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు, తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో యానిమల్ బ్యూటీ ట్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత విక్కీ ఛావాలో ఛత్రపతి శంభాజీ పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రణబీర్ కపూర్, అలియా భట్‌లతో కలిసి లవ్ అండ్ వార్‌ చిత్రంలో నటించనున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)