Breaking News

తండ్రయిన వెంటనే ఖరీదైన కారు కొన్న హీరో

Published on Sat, 12/06/2025 - 10:12

బాలీవుడ్‌ స్టార్‌ జంట విక్కీ కౌశల్‌- కత్రినా కైఫ్‌ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు. నవంబర్‌ 7న కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబును ఆడించడంలోనే ఈ దంపతులిద్దరూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. బాబు పుట్టాక తొలిసారి ఓ ఖరీదైన వస్తువు కొన్నారు.

లగ్జరీ కారు
లెక్సస్‌ బ్రాండ్‌కు LM350h 4S మోడల్‌ కారును తమ సొంతం చేసుకున్నారు. దీని విలువ రూ.3.20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్‌ ఈ కారును నడుపుతున్న పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారులో ప్రీమియం సౌండ్‌తో పాటు 48 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. సీటింగ్‌ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

అదో కొత్త ఫీలింగ్‌
ఇకపోతే ఈ ఏడాది తనకు ఎక్కువ సంతోషాన్నిచ్చిన క్షణం.. తాను తండ్రవడమేనని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు విక్కీ కౌశల్‌. అది మాటల్లో చెప్పలేని అనుభూతి అని, ఒక మ్యాజికల్‌ మూమెంట్‌ అని పేర్కొన్నాడు. ఈ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా భావోద్వేగానికి లోనవుతానని తనకు తెలుసని.. బాబును చేతుల్లోకి తీసుకున్నప్పుడు మనసుకెంతో ప్రశాంతంగా అనిపించిందన్నాడు. అలాంటి అనుభూతి అంతకుముందెన్నడూ కలగలేదని గుర్తు చేసుకున్నాడు. కాగా విక్కీ కౌశల్‌ (Vicky Kaushal), కత్రినా 2021 డిసెంబర్‌ 9న పెళ్లి చేసుకున్నారు.

చదవండి: అఖండ 2.. ఇప్పట్లో రిలీజ్‌ లేనట్లేనా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)