Breaking News

ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్‌ రివర్స్‌?!

Published on Sat, 02/22/2025 - 15:59

ఎక్కడ చూసినా ఛావా (Chhaava Movie) ప్రభంజనమే! ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడు శంబాజీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆయన చరిత్రను అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో తెరకెక్కిన సినిమా ఛావా. ఓపక్క ప్రేక్షకుల రక్తం మరిగేలా చేస్తూ మరోపక్క వారిని సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తోందీ మూవీ.

పుష్ప 2 Vs ఛావా అయ్యేది!
ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజైంది. నిజానికి గతేడాది డిసెంబర్‌ 6న ఛావాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) కూడా సరిగ్గా అప్పుడే వస్తున్నట్లు తెలిసి ఆలోచనలో పడ్డారు. అప్పటికే పుష్ప 1 బ్లాక్‌బస్టర్‌. దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2ను పాన్‌ ఇండియావైడ్‌గా డిసెంబర్‌ 5న రిలీజ్‌ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇలాంటి సమయంలో పుష్పరాజ్‌కు పోటీగా వెళ్తే రెండు సినిమాల కలెక్షన్స్‌ దెబ్బతినే అవకాశం ఉందని ఛావా మేకర్స్‌ వెనక్కు తగ్గారు.

పుష్పరాజ్‌కు దారిచ్చిన ఛావా
పుష్పరాజ్‌కు దారిస్తూ కొత్త డేట్‌ వెతుక్కున్నారు. అందుకుగానూ అల్లు అర్జున్‌ (Allu Arjun) ఛావా యూనిట్‌కు స్పెషల్‌గా థాంక్స్‌ కూడా చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలు లాభపడ్డాయి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1850 కోట్లు సాధించింది. ఇప్పుడు ఛావాకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కలెక్షన్స్‌ ఊపందుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించడం విశేషం. 

(చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో)

ఇద్దరి కెరీర్‌లో మైలురాయి..
అల్లు అర్జున్‌ కెరీర్‌లో పుష్ప ఎలాగో విక్కీ కౌశల్‌ కెరీర్‌లో ఛావా అంతే ప్రత్యకంగా నిలిచిపోనుంది. ఛావా సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఛావా అన్నిచోట్లా ఆదరణ పొందుతోంది. శివాజీ సావంత్‌ రాసిన మరాఠీ నవల వల్ల శంభాజీ వీరత్వాన్ని సినిమాగా పరిచయం చేయడానికి వీలైంది అన్నారు.

మోదీ ప్రశంసలు
ఇందుకు సంబంధించిన వీడియోను విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ ఛావాను ప్రశంసించడం, ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ త్యాగాన్ని కీర్తించినందుకు గర్వంగా ఉంది. ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చాడు. ఛావాలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా, ఔరంగజేబుగా అక్షయ్‌ ఖన్నా నటించారు. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా రాబట్టింది.

చదవండి: అయ్య బాబోయ్‌.. కిచ్చ సుదీప్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)