చరిత్ర తిరగరాస్తోన్న ఛావా.. ఏకంగా బాహుబలి-2 రికార్డ్‌ను కూడా!

Published on Tue, 03/11/2025 - 13:43

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్‌ చిత్రం ఛావా. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదట హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా తిరుగులేని వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల తెలుగులోనూ విడుదలైన ఛావా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.

తాజాగా ఈ చిత్రం హిందీలో క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించింది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 హిందీలో రూ.510 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఛావా చిత్రం ఆ రికార్డ్‌ను దాటేసింది. కేవలం హిందీలోనే రూ.516 కోట్ల వసూళ్లు చేసింది. కేవలం విడుదలైన 25 రోజుల్లోనే బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా హిందీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. దీంతో విక్కీ కౌశల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

తెలుగులోనూ దూసుకెళ్తోన్న ఛావా..

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్‌ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్‌ కలెక్షన్స్‌తో పాటు సినిమాలోని క్లైమాక్స్‌ సీన్‌ మేకింగ్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్‌ ఖన్నా మేకింగ్‌ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్‌ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్‌లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్‌ పేర్కొంది.

Chhaava Movie: ఇండియాలోనే 500 కోట్లు దాటిన కలెక్షన్లు

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)