Breaking News

సూర్య ‘వాడివాసల్‌’ మూవీ ఆగిపోయిందా?

Published on Sun, 12/10/2023 - 09:12

సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌, యువీక్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను సూర్య పూర్తి చేశారు. తదుపరి సుధా కొంగర దర్శకత్వంలో తన 43వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సూర్య 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించనుంది. కాగా సూర్య, దర్శకుడు వెట్రిమారన్‌ కాంబినేషన్లో వాడివాసల్‌ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సింది.

అయితే దర్శకుడు వెట్రిమారన్‌ హాస్యనటుడు సూరి కథానాయకుడిగా విడుదలై చిత్రాన్ని ముందు పూర్తి చేయడానికి సిద్ధం అయ్యారు. దీంతో వాడివాసల్‌ చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది. సూర్య కంగువా చిత్ర షూటింగ్‌తో బిజీ అయ్యారు. విడుదలై చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వెట్రిమారన్‌ విడుదలై చిత్రానికి సీక్వెల్‌ను చేస్తున్నారు. దీంతో సూర్యతో చేయాల్సిన వాడివాసల్‌ చిత్రం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ చిత్రం ఆగిపోయిందనే ప్రచారం జోరందుకుంది.

దీని గురించి నిర్మాత థాను క్లారిటీ ఇచ్చినా రకరకాల ప్రచారం ట్రోలింగ్‌ అవుతునే ఉంది. సూర్య తన 43వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేయడానికి సిద్ధం అవడంతో వెట్రిమారన్‌ తదుపరి అజిత్‌ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తన తదుపరి చిత్రం వాడివాసల్‌ అని, ఇందులో నటుడు సూర్యనే హీరో అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం సూర్యకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని వెట్రిమారన్‌ వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)