Breaking News

'ఇదే చివరి సినిమా..'.. స్టార్ డైెరెక్టర్ షాకింగ్‌ నిర్ణయం

Published on Mon, 09/01/2025 - 20:07

కోలీవుడ్లో పలు సూపర్ హిట్సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వెట్రిమారన్. అసురన్‌, పొల్లధవన్‌, వడ చెన్నై, విడుదలై లాంటి చిత్రాలతో హిట్స్తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం శింబు హీరోగా మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఒకవైపు డైరెక్టర్గా రాణిస్తూనే సొంతంగా ప్రొడక్షన్హౌస్నడిపిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ గ్రాస్రూట్ఫిల్మ్ బ్యానర్లో పలు సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం బ్యానర్లో బ్యాడ్ గర్ల్ అనే మూవీని నిర్మించారు.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తన నిర్మాణ సంస్థను మూసివేస్తున్నట్లు వెట్రిమారన్ ప్రకటించారు.. సినిమా నిర్మాణం సవాల్తో కూడుకున్నదని అన్నారు. మూవీ తీయడానికి డబ్బు అప్పుగా తీసుకోవడం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడారు. బ్యాడ్ గర్ల్ మూవీ మా నిర్మాణ సంస్థ చివరి చిత్రం అవుతుందని వెట్రిమారన్ వెల్లడించారు. నిర్మాత చేయడం టాక్సింగ్‌గా ఉందని  కామెంట్స్ చేశారు.

కాగా.. వర్ష భారత్ దర్శకత్వం వహించిన 'బ్యాడ్ గర్ల్' చిత్రంలో అంజలి శివరామన్, శాంతి ప్రియ నటించారు. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. వివాదం తలెత్తింది. దీంతో సినిమాను రివైజింగ్ కమిటీకి పంపగా.. చివరికి యూ/ సర్టిఫికేట్ ఇచ్చారు. పిల్లలకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.

దర్శకుడు వెట్రి మారన్ మాట్లాడుతూ.. "నిర్మాతగా ఉండటం అనేది ఒక టాక్సింగ్ జాబ్‌ లాంటిది. దర్శకుడిగా ఉండటం అనేది సృజనాత్మకమైన పని. ఆ ఉద్యోగంలో ఎటువంటి ఒత్తిడి ఉండదు. మన పని మనం చేసుకోవాలి. కానీ, మీరు నిర్మాత అయితే మాత్రం ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చివరికీ టీజర్ కింద వచ్చే కామెంట్స్కూడా చదవాలి. నటీనటులు, ప్రకటనలు సినిమా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక నిర్మాతగా అది చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. దర్శకుడు మిస్కిన్‌తో కొన్ని రోజుల క్రితం దీని గురించి మాట్లాడా" అని అన్నారు. తన నిర్మాణ సంస్థలో వస్తోన్న మానుషి చిత్రం రివైజింగ్ కమిటీ వద్ద ఉందని పేర్కొన్నారు. కాగా.. బ్యాడ్ గర్ల్ సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)