Breaking News

ఢిల్లీ గణేష్‌ కన్నుమూత

Published on Mon, 11/11/2024 - 00:12

సీనియర్‌ తమిళ నటుడు ఢిల్లీ గణేష్‌ (80) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యం కారణంగా శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నై రామాపురంలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1964–74 మధ్య కాలంలో ఇండియ¯Œ  ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు ఢిల్లీ గణేష్‌. కళలపై ఉన్న ఆసక్తితో ఢిల్లీకి చెందిన దక్షిణ భారత నాటక సభలో సభ్యుడిగా చేరారు. అనంతరం సినీ రంగ ప్రవేశం చేశారు.

కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘పట్టణ ప్రవేశం’(1976) చిత్రం ద్వారా నటుడుగా పరిచయమయ్యారాయన. ‘ఎంగమ్మ మహారాణి’ అనే మూవీలో హీరోగా నటించారు కూడా. తమిళంతో పాటు తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో సహాయ నటుడిగా, హాస్యనటుడిగా దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. అలాగే పలు సీరియల్స్‌లోనూ, కొన్ని వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు. ఆయన మంచి నటుడే కాదు.. డబ్బింగ్‌ కళాకారుడు కూడా. పలువురు ప్రముఖ నటులకు  గాత్రదానం చేశారు.

ఢిల్లీ గణేశ్‌ తెలుగులో ‘జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమి నాగు’ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నేడు(సోమవారం) ఉదయం 10 గంటలకు చెన్నైలో ఢిల్లీ గణేశ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు మాధవన్‌ గణేష్‌ తెలిపారు.

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)