Breaking News

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం

Published on Sat, 02/04/2023 - 14:45

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్‌ వాణీ జయరాం హఠాన్మరణం చెందారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి విశ్వానాథ్‌ మరణం నుంచి కోలుకోకముందే వాణీజయరాం మరణంతో మరోసారి సినీ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. కాగా చెన్నైలో జన్మించిన ఆమె దాదాపు వెయ్యి సినిమాల్లో పది వేలకుపైగా పాటలు పాడారు.

తెలుగు, తమిళంతో కలిపి 14 భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. ఇక సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్‌ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును అందుకోకముందే వాణీ మృతి చెందడం విచారకరం. కాగా 1945 నవంబర్‌ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించారు వాణీ జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. 1971లో ఆమె గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. రంగరామానుజా అయ్యంగార్‌ వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంతో శిక్షిణ తీసుకున్నారు.

కర్ణాటక సంగీతంలో సాధన చేసిన ఆమె 8 ఏళ్ల వయసులోనే ఆల్‌ ఇండియా రెడియోలో పాట పాడి మురిపించారు. కె విశ్వనాథ్‌ తీసిన స్వాతికిరణం చిత్రంలో ఆమె 8 పాటలు పాడారు. ఇక ఆమె పాడిన తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటూ ఆమె కంఠం స్వరమాధుర్యాలను వెదజల్లింది. భక్తి సంగీత ప్రధానమైన పాట అనగానే దర్శకులకు గుర్తొచ్చేది వాణీ జయరాం. అంతగా తన గాత్రంతో 5 దశాబ్దాలుగా సంగీత ప్రియులను మైమరిపించారు వాణీ జయరాం. 

చదవండి: 
మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)