Breaking News

Leelavathi: ఆమె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: సుమలత పోస్ట్ వైరల్

Published on Fri, 12/08/2023 - 19:31

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ నటి లీలావతి(85) కన్నుమూశారు.  వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీనియర్ నటి సుమలత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ రోజు ఆమె ఫామ్‌హౌస్‌లో ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు నెలమంగళలోని నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

సుమలత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'లీలావతి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించిన లీలావతి సౌత్‌లో విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమాలో నాకు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. ఈ విషాద సమయంలో ఆ భగవంతుడు లీలావతి కుటుంబ సభ్యులకు, అభిమానులకు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. 

లీలావతి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాలలో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ ఆరు దశాబ్దాలుగా సాగింది. ఆమెకు 1999-2000లో జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన డా. రాజ్‌కుమార్ అవార్డు, 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సహా అనేక ప్రశంసలను అందుకుంది.

బెల్తంగడిలో జన్మించిన లీలావతి చిన్నతనంలోనే నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. 1949లో సినీ రంగ ప్రవేశం చేసిన లీలావతి ఆ తర్వాత కన్నడ సినిమాలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు అయిన వినోద్ రాజ్‌తో కలిసి జీవించారు.  1949లో శంకర్ సింగ్ దర్శకత్వం వహించిన నాగకన్నికే సినిమాతో అరంగేట్రం చేశారామె. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)