Breaking News

భిన్నమైన కాన్సెప్ట్‌తో వస్తోన్న చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?

Published on Thu, 03/28/2024 - 16:23

జీవితాల్లోని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాల్లో జీవం ఉంటుంది. అలాంటి కథలకు కాస్త సినిమా టిక్‌ సన్నివేశాలను కలిపితే అది మరింత జనరంజక చిత్రంగా మారుతుంది. ఈ తరహా చిత్రాలకు పెద్దగా క్యాస్టింగ్‌ గురించి పట్టించుకోరు. కథ, కథనాలు బిగువుగా ఉంటే చాలు.. అలాంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం వెప్పమ్‌ కుళీర్‌ మళై. హాష్ ట్యాగ్‌ ఎఫ్‌డీఎఫ్‌ఎస్‌ పతాకంపై ధీరవ్‌ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఇస్మత్‌ భాను హీరోయిన్‌గా పరిచయమవుతోంది. పస్కల్‌ వేదముత్తు ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. 

ముఖ్యంగా పిల్లల పుట్టుక గురించి ఆవిష్కరించిన చిత్రమిది. పెళ్లి తరువాత ఆ దంపతులకు పిల్లలు పుట్టక పోతే కుటుంబ సభ్యుల నుంచి, ఊరు జనం వరకూ ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆధునిక సమాజంలో ప్రకృతికి విరుద్ధంగా కలిగి సంతానం కారణంగా ఎలాంటి మనోవేదనకు గురవుతారు? వంటి అంశాలను, సహజ సిద్ధంగా పిల్లలు పుట్టడానికి కారణాలు అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రమే  వెప్పమ్‌ కళీర్‌ మళై.

ఈ సినిమాలో ఎంఎస్‌ భాస్కర్, నటి రమ, మాస్టర్‌ కార్తీకేయన్, దేవ్‌హబిబుల్లా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శంకర్‌ రంగరాజన్‌ సంగీతాన్ని, పృధ్వీ రాజేంద్రన్‌ ఛాయాగ్రహణం అందించారు.  దర్శకుడు ఒక  గ్రామీణ నేపథ్యాన్ని తీసుకుని వైవిధ్యంగా తెరకెక్కించారు.  ఆధ్యంతం ఆసక్తిని రేకెత్తించేలా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?