Breaking News

ఉత్కంఠ రేపుతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైన‌ల్ ట్రైల‌ర్

Published on Sat, 09/14/2024 - 10:36

‘మ్యాడ్‌ మ్యాక్స్, ది రెవినాంట్, ఇన్సెప్షన్‌’ వంటి సినిమాల్లో నటించిన టామ్‌ హార్డీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వెనమ్‌: ది లాస్ట్‌ డాన్స్‌’. కెల్లీ మార్సెల్‌ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, మార్వెల్‌ సంయుక్తంగా నిర్మించాయి. సోనీ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఇండియాలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనుంది. 3డితో పాటు ఐమాక్స్‌ 3డి వెర్షన్‌లో అక్టోబర్‌ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(చదవండి: పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో మహేశ్‌-రాజమౌళి సినిమా)

ఈ సందర్భంగా ఈ చిత్రం ఫైనల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ‘‘ఇది నీకు నచ్చకపోవచ్చు... నచ్చదు... నాకు కచ్చితంగా నచ్చదని గ్యారెంటీ ఇస్తున్నాను’, ‘ఆ గ్రహవాసులు మనల్ని కనిపెట్టారు’, ‘దాన్ని ఎవరు పంపించారు... ఆ సృష్టిక్తర’, ‘మీరు కలిసుంటే ఈ ప్రపంచం మనుగడ సాగించలేదు’ వంటి డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘టామ్‌ హార్డీ నటనతో ΄ాటు వెనమ్‌ క్యారెక్ట్‌ చేసే యాక్షన్‌ సీన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ‘వెనమ్‌’ మొదటి భాగం, రెండవ భాగం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘వెనమ్‌: ది లాస్ట్‌ డాన్స్‌’ పై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)