Breaking News

'మేరీని ఎవరు హత్య చేశారో డిసెంబర్‌ 25న తెలుస్తుంది'

Published on Tue, 12/17/2024 - 05:18

‘పులిదండి మేరి... మే 22వ తారీఖున పన్నెండు... ఒంటిగంట మధ్య హత్యకు గురైంది’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ సినిమా ట్రైలర్‌. ‘వెన్నెల’ కిశోర్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ఇది. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ సినిమాలో సీయా గౌతమ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా నటించారు. రైటర్‌ మోహన్‌ దర్శకత్వంలో శ్రీ గణపతి సినిమాస్‌ పతాకంపై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం రిలీజ్‌  చేశారు.

‘మూడు నెలల మధ్యలో మూడు చావులు... ఇంకెన్ని చావులు చూడాలయ్యా ఈ బీచ్‌లో’, ‘ఇంద్ర ధనస్సులో కలర్లు ఏడు... ఈ క్రైమ్‌ సస్పెక్ట్‌లు కూడా ఏడే’, ‘నా కాడ ఇన్ఫర్మేషన్‌ ఉన్నాది... కన్ఫర్మేషన్‌ కోసం చూస్తున్నాను... ఇక తీగ లాగడమే...’, అనే డైలాగ్స్‌ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ టైటిల్‌కు వెన్నెల కిశోర్‌ జీవం పోశారు. షెర్లాక్‌ ప్రవర్తనలో హ్యుమర్‌ ఉన్నప్పటికీ, కేసును పరిష్కరించడంలో అతని తెలివితేటలు ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)