Breaking News

నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు, దటీజ్‌ మనోజ్‌: వెన్నెల కిశోర్‌

Published on Sat, 03/04/2023 - 22:08

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌.. భూమా మౌనికను పెళ్లాడాడు. మార్చి 3న జరిగిన వీరి వివాహానికి అతి దగ్గరి బంధుమిత్రులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన మనోజ్‌, మౌనికల పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మనోజ్‌ పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి కమెడియన్‌ వెన్నెల కిశోర్‌ వాయిస్‌ అందించడం విశేషం.

'పెళ్లి.. మ్యారేజ్‌.. మూడు ముళ్ల బంధం, ఆరడుగుల అనుబంధం.. సారీ, మావాడు ఆరడుగులు కదా, సో సెంటిమెంటల్‌గా ఉంటుందని బ్రేకింగ్‌ ద రూల్స్‌! M, M ఫ్రెండ్స్‌ కదా.. అలాగే ఉంటాయి మరి!' అంటూ మనోజ్‌, మౌనికల గురించి ఇంట్రడక్షన్‌ ఇచ్చాడు వెన్నెల కిశోర్‌. 'వయసుతో సంబంధం లేకుండా, రేంజును చూడకుండా నచ్చితే నావాడు, మెచ్చితే మనోడు.. అదే మంచు మనోజ్‌ లైఫ్‌ స్టైల్‌. డిగ్రీ సర్టిఫికెట్‌లు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ స్కూల్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ మాత్రం 14 ఉన్నాయి. మనోడికి ఫారిన్‌ వెళ్లి మరీ చదివిన సీమబిడ్డ భూమా మౌనికతో ఆ దేవుడు ముడి వేశాడు. వీళ్లిద్దరిదీ బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌.

నేను నీకెలా సాయపడగలను? అని వాట్సాప్‌ స్టేటస్‌ కాకుండా ఏకంగా ప్రొఫైల్‌ పిక్‌ పెట్టుకున్నాడు. నమ్మితేనే చేయందిస్తాడు.. అలాంటిది నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు. దటీజ్‌ మనోజ్‌. ఏడడుగులు.. ఏడేడు జన్మల వరకు అలాగే ఉండాలని కోరుకుంటున్నా.. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌' అని ముగించాడు వెన్నెల కిశోర్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)